భట్టిపై సీఎం కేసీఆర్‌ ధ్వజం..

486
cm kcr
- Advertisement -

శాసనసభ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్ల అప్పు ఉందని భట్టి రుజువు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం ముసుగులో ఏది పడితే అదిమాట్లాడటం సరికాదని…విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే మంచిదన్నారు.

2 లక్షల కోట్ల అప్పును మూడ లక్షల కోట్ల అప్పుగా చూపిస్తే ఊరుకుంటామా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా…? ఒక్క ప్రాజెక్టు కనిపించడం లేదా…?కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు స్ధాయిలో పూర్తి చేశాం…ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టు భట్టికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.

కళ్లున్న కబోదుల్లాగా ప్రతిపక్ష నేతలు మాట్లాడటం సరికాదని…తప్పులు, అబద్దాలు మాట్లాడితే అడుగడుగునా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. సభలో సభ్యులందరూ సమానమేనని… ప్రతిపక్షమనే వంకతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌పార్టీది ఐదేళ్లుగా ఇదే ధోరణి…ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు.

సత్యదూరమైన మాటలు మాట్లాడి సభ్యులను, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని భట్టికి సూచించారు సీఎం. దేశంలో మాంద్యం నెలకొని ఉంది. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. ఆర్థిక నిపుణులను సంప్రదించిన తర్వాతే బడ్జెట్‌ను రూపొందించాం. ప్రతి లెక్కను సభ ముందు పెడుతామని చెప్పారు.

- Advertisement -