సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత..

176
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసంలో విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి సోదరి లీలమ్మ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోదరి లీలమ్మ మృతితో ఢిల్లీ పర్యటనను సీఎం కేసీఆర్ మధ్యలోనే రద్దు చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అక్కడ్నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.

CM KCR Sister Leelamma passes away

ఇక మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనను రద్దు చేసుకున్నారు. యశోదా ఆస్పత్రిలో కేటీఆర్, హరీశ్ రావు, సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. లీలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రి నుంచి లీలమ్మ భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించారు. లీలమ్మ స్వస్థలం పదిర గ్రామం, ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్నసిరిసిల్ల జిల్లా. లీలమ్మ, శంకర్ రావు దంపతులకు ఇద్దరు కుమారులు.. కాంతరావు, మధుసూదన్ రావు. లీలమ్మ మృతిచెందినట్లు తెలుసుకున్న కేసీఆర్‌ బంధువులు, సన్నిహితులు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు.

- Advertisement -