ఆ ముగ్గురికి షాక్ ఇవ్వనున్న సీఎం కేసీఆర్..!

273
kcr
- Advertisement -

ఓ వైపు లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలవ్వగా మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్టు కోసం అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు సిట్టింగ్‌లకు ఓకే చెప్పిన సీఎం కేసీఆర్ వారిని ప్రచారం చేసుకోవాలని సూచించగా ముగ్గురు సిట్టింగ్‌లకు షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్‌ కుమార్, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి గడెం నగేష్‌, జహీరాబాద్‌ నుంచి బీబీ పాటిల్‌, భువనగిరి నుంచి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌ బరిలోకి దిగనున్నారు. కరీంనగర్‌ లోక్ సభ స్ధానం నుండి ఎంపీ వినోద్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడంతో పాటు ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

లోక్‌సభ ఎన్నికలపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో నిజామాబాద్‌ సభలో అభ్యర్థులను ప్రకటిస్తారా…? లేదా సభ ముగిసాక ప్రకటిస్తారా అన్న సస్పెన్స్ అందరిలో నెలకొంది.

మల్కాజిగిరి లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ వెంకటరామిరెడ్డి పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. చేవెళ్ల అభ్యర్థిగా కార్తీక్ రెడ్డి ,ఖమ్మం స్థానానికి వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ లేదా నామా నాగేశ్వరరావు,సికింద్రాబాద్ కు తలసాని కుమారుడు సాయికిరణ్ , మహబూబాబాద్ కు బానోతు కవిత, నాగర్‌ కర్నూల్ కు పి.రాములు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఖచ్చితంగా ముగ్గురు సిట్టింగ్‌లకు మొండి చేయిచూపనున్నట్టు సమాచారం. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబాద్ ఎంపీ ప్రొ.సీతారాం నాయక్ లకు తిరిగి టికెట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్త అభ్యర్థులను పోటీకి దించనున్నారని తెలుస్తోంది.

- Advertisement -