క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్లపై సీఎం కీలక ప్రకటన..

248
cm kcr

రెవెన్యూ వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసింది తెలంగాణ ప్రభుత్వం. కుల ధృవీకరణ పత్రాలు మొదలుకొని భూముల రిజిస్ట్రేషన్ వరకు అన్నింటా సంచలన మార్పులు చేపట్టింది. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఇకపై కుల ధృవీకరణపత్రం (caste certificate), ఆదాయ ధృవీకరణ పత్రం (Income certificate) కోసం విద్యార్థుల పడే బాధలు కూడా తొలగుతాయని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. కుల ధృవీకరణ పత్రాన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలే మంజూరు చేస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు అధికారులతో అవసరం లేకుండానే.. డేటాబేస్ ద్వారానే ఇన్‌కమ్ సర్టిఫికెట్ జారీ చేస్తామని వెల్లడించారు.

” లైఫ్‌టైమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నాం. కుల ధృవీకరణ పత్రం ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకే ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు ఉండదు. వాటన్నింటినీ కంప్యూటరైజ్డ్ చేస్తాం. ఆ పక్రియ పూర్తైతే మాటిమాటికీ సర్టిఫికెట్ కోసం తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రజల ఆదాయ, ఉద్యోగాలకు సంబంధించి మంచి డేటాబేస్ ఉంది. డేటాబేసే ఆదాయ ధృవీకరణ పత్రం మంజూరు. ఇందులో ఎలాంటి మానవ ప్రమేయం ఉండదు. ప్రాక్టికల్‌గా చేసి చూశాం. చాలా బాగుంది. ఇందులో ఎలాంటి పక్షపాతం ఉండదు. క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ల పీడ కూడా విరగడవుతుంది. అని కేసీఆర్ అన్నారు.