పవర్ రీఫామ్స్‌ను వ్యతిరేకిస్తున్నాం: సీఎం కేసీఆర్

67
kcr
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మరోసారి ఫైరయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్….విద్యుత్ సంస్కరణల బిల్లు కోసం తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడేవన్ని అబద్దాలేనని…అసలు ఆయనకు చదువు వచ్చా రాదా అని ప్రశ్నించారు.

ఏపీలో మీటర్లు పెడుతున్నారు..కానీ తెలంగాణలో పెట్టడం లేదన్నారు. నరేంద్రమోడీ చెప్పేది ఒకటి చేసేది మరొక్కటన్నారు. ప్రధానిగా పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. కళ్లముందు అన్ని వాస్తవాలు ఉన్నా అబద్దాలు ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణల బిల్లు పాస్ కాకముందే రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటికరించాలనే ఉద్దేశంతో రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శలు గుప్పించారు.

బీజేపీ నేతల అబద్దాలు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయన్నారు. మోడీ చెప్పేది ఒకటి చేసేది మరోకటి అన్నారు. కొంతమంది పెట్టుబడిదారుల స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను వంచించడం సరికాదన్నారు. పవర్ రీ ఫామ్స్‌ను వ్యతిరేకిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

- Advertisement -