పెన్షన్ దారులకు సీఎం కేసీఆర్ తీపి కబురు..

163
- Advertisement -

రాష్ట్రంలో పెన్షన్ దారుల బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు పెన్షనర్లకు పెరిగిన వేతనాలను 36 వాయిదాలలో చెల్లించడానికి గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ హామీ మేర‌కు జీవో నెంబర్ 1406ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ జీవో విడుద‌ల ప‌ట్ల రిటైర్డ్ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

పెరిగిన ఫించను, గ్రాట్యుటీ బకాయిలు జనవరి 22 నుండి చెల్లింపు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి నుంచి పెన్షన్ దారులకు బకాయిలు అందనున్నాయి. 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు బకాయిలు ఏకమొత్తంగా అందించనున్నది ప్రభుత్వం. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావుకు తెలంగాణ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు దేవీ ప్ర‌సాద్‌తో పాటు రిటైర్డ్ ఉద్యోగులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

- Advertisement -