2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత ఏడు సంవత్సరాలలో జరిగిన నీటి సంరక్షణ కార్యక్రమాలను గుర్తించేందుకు, ప్రోత్సహించేందుకు “హైదరాబాద్ నీటి సంరక్షణ అవార్డు -2021”ను ప్రకటిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (ఔటర్ రింగ్ రోడు పరిమితుల్లో ) వివిధ సంస్థలు చేపట్టిన ఉత్తమ, ఆదర్శ కార్యక్రమాలను, టెక్నాలజీ పద్దతులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (TWRDCL) ఈ క్రింది రంగాల్లో చేపట్టిన నీటి సంరక్షణ కార్యక్రమాలను, పద్దతులను సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
నీటి సంరక్షణ రంగాలు:
1.నీటి సంరక్షణ వినూత్న పద్దతులు
2.వర్షపు నీటి సంరక్షణ, కృత్రిమ రీచార్జి ద్వారా భుజలాలను పెంచుట
3.వర్షపు నీటి సంరక్షణను పెంపొందించుట
4.నీటి పునరుపయోగం, రీసైక్లింగ్, ట్రీట్ మెంట్ మురిగి / కలుషిత
5.చెరువులు, కాలువల పునరుద్దరణ
6.నీటి సంరక్షణ కొరకు ప్రజలను చైతన్య పర్చడం, సమీకరించే ఉద్యమాలు
నీటి సంరక్షణ అవార్డులు:
1.ఉత్తమ ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థ
2.ఉత్తమ పాటశాల
3.ఉత్తమ అపార్ట్ మెంట్
4.ఉత్తమ కాలనీలు/గేటెడ్ కమ్యూనిటీలు
5.ఉత్తమ వ్యక్తులు
6.ఉత్తమ స్వచ్చంద సంస్థలు (NGO)
7.ఉత్తమ ప్రొఫెషనల్స్
8.చెరువులు, కాలువల పునరుద్దరణ
9.ఉత్తమ మీడియా (ప్రింట్, ఎలక్ట్రానిక్)
10.ఉత్తమ పరిశ్రమ
11.ఉత్తమ కార్పోరెట్ సోషల్ రేస్పాన్సిబిల్
నీటి సంరక్షణ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థల కార్యక్రమాల పూర్తి వివరాలతో దరఖాస్తులను డిసెంబర్ 31, 2021 లోగా hyderabadwaterawards@gmail.com కు పంపించాలి. https://tswalamtari.weebly.com కు ఎవరైనా దరఖాస్తులను పంపవచ్చు.
పైన పేర్కొన ఆరు రంగాల్లోని నీటి సంరక్షణ సేవలను/కృషికి/పద్దతులను వివరిస్తూ క్రింది కేటగిరిలకు సంబంధించిన వ్యక్తులు, సంస్థలు ఎవరైనా దరఖాస్తు పంపగలరు. ప్రభుత్వ/ప్రైవేట్, అపార్టుమెంట్ అసోసియేషన్, కాలని/గేటెడ్ కమ్యూనిటి అసోసియేషన్, పాటశాలలు, వ్యక్తులు, NGOలు, ప్రొఫెషనల్స్, ప్రింట్/ఎలక్ట్రానిక్ మీడియా, పరిశ్రమలు, హైదరాబాద్ నీటిసంరక్షణ అవార్డులు-2021 కొరకు వారి సేవలకు సంబంధించిన రంగంలో దరఖాస్తులను డిసెంబర్ 31, 2021 లోగా పంపవచ్చని TWRDC చైర్మెన్ కోరారు.

