ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు..

34
- Advertisement -

సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం వేల సంఖ్యలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం తెలిసిందే. బకాయిల చెల్లింపు, వేతనాల పెంపు, జీవో నెం.4779 రద్దు చేయాలన్న డిమాండ్ల నాడు ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేశారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వారిని తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. దాదాపు 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు వేసినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్టు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే, ఫీల్డ్ అసిస్టెంట్లు మరోసారి పొరపాటు చేయొద్దని హితవు పలికారు. సెర్ప్ ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన విషయం తెలిపారు.

- Advertisement -