రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ఢిల్లీ నుండి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో మాట్లాడిన సీఎం…గులాబ్ తుఫాను ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పోలీసు, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని…భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు.