సమగ్ర భూసర్వేపై సీఎం కేసీఆర్ రివ్యూ

15
kcr

రాష్ట్రంలో నిర్వహించనున్న సమగ్ర భూ సర్వేపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. రాష్ట్ర అవతరణ వేడుకల అనంతరం సంబంధిత శాఖల ఉన్న‌తాధికారులు, స‌ర్వే కంపెనీల ప్ర‌తినిధుల‌తో సీఎం స‌మావేశ‌మ‌య్యారు.

భూ వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా 95 శాతానికిపైగా భూముల రికార్డులను సరిచేశారు. వాటన్నింటినీ డిజిటలైజ్‌ చేశారు. ప్రజల చెంతకు భూ రికార్డులను చేర్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. భూసర్వే కోసం బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కూడా కేటాయించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే 17 స‌ర్వే కంపెనీల ప్ర‌తినిధుల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ స‌మావేశ‌మై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే.