పోడు భూములపై సీఎం కేసీఆర్ సమీక్ష..

148
- Advertisement -

రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ, హరితహారం అంశాలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోడు భూముల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నారు. అడ‌వులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై, హ‌రిత‌హారం ద్వారా విస్తృత ఫ‌లితాల కోసం ప్ర‌ణాళిక‌ల‌పై చర్చించ‌నున్నారు. పోడు స‌మ‌స్య‌పై అట‌వీ, గిరిజ‌న సంక్షేమ శాఖ‌ల అధికారులు మూడు రోజుల పాటు జిల్లాల్లో ప‌ర్య‌టించి అధ్య‌య‌నం చేశారు. క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌పై సీఎంకు ఉన్న‌తాధికారులు నివేదిక ఇవ్వ‌నున్నారు.

ఈ సమావేశంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా కన్జర్వేటర్లు, డిఎఫ్ఓ లతో పాటు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -