తెలంగాణలో స్వ‌ల్ప భూకంపం..

61

తెలంగాణలో ఈ రోజు మధ్యాహ్నం పలు చోట్ల స్వల్ప భూమి కంపించింది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌లు చోట్ల స్వ‌ల్ప భూప్రకంప‌న‌లు సంభ‌వించాయి. శ‌నివారం మ‌ధ్యాహ్నం 2:03 నిమిషాల‌కు స్వ‌ల్పంగా భూమి కంపించింది. మంచిర్యాల పట్టణంలోని గోసేవ మండల్ కాలనీ, నస్పూర్, రాంనగర్ తో పాటు జిల్లాలోని షిర్కే, సీతారాంపల్లి, సున్నంబట్టివాడ, సీతారాంపూర్ ప్రాంతాల్లో భూమి కంపించింది. అటు, పెద్దపల్లి జిల్లాలోని మల్కాపూర్, ఎన్టీపీసీ, నర్రాశాలపల్లె, జ్యోతినగర్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.

రెండు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనల తీవ్రత 4గా గుర్తించారు. భూకంప కేంద్రం కరీంనగర్‌కు ఈశాన్య దిక్కులో 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వెల్లడైంది. ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.