రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో జరిగే ఈ సమీక్షా సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు పల్లె ప్రగతి ,పట్టణ ప్రగతి కార్యక్రమం జరగనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు పల్లెల్లో జరిగిన అభివృద్ధి ఏంటి.? ఇంకా ఏ విధంగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.ఇప్పటి వరకు డంపింగ్ యార్డ్స్ వద్ద జమ చేసిన చెత్త నుంచి ఎరువులు తయారు చేసుకోవడం పై సూచనలు చేయనున్నారు . చెత్త ద్వారా ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించనున్నారు.
మున్సిపాలిటీ లో ప్రతి ఇంటికి డోర్ నెంబర్ వేసే కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయాలని సూచించనున్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం వార్డు కమిటీలను వేసి వార్డు ఆఫీసర్ ని నియమించాలనే ఆలోచన లో ప్రభుత్వం ఉంది. అలాగే మున్సిపాలిటీల అభివృద్ధి ఆదాయ మార్గాల పై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచనలు చేయనున్నారు.