గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ బహిరంగసభ..

36
- Advertisement -

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ నెల 9న తొలుత గజ్వేల్‌లో నామినేషన్‌ వేసి అనంతరం కామారెడ్డి చేరుకుంటారు. అక్కడ నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం ప్రజాఆశీర్వాద సభలో పాల్గొంటారు. 28న గజ్వేల్‌ సభతో ప్రచారాన్ని ముగిస్తారు.

2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో గజ్వేల్‌తోనే ప్రచారాన్ని ముగించారు. ఈ సారి కూడా గజ్వేల్‌తోనే ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. 2018 ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈసారి 96 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు సీఎం కేసీఆర్.

సీఎం కేసీఆర్ సభతో ప్రజల్లో జోష్ నెలకొంది. ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

Also Read:కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్

- Advertisement -