కరోనా మన దేశంలో పుట్టిన వ్యాధి కాదుః సీఎం కేసీఆర్

286
kcroncarona
- Advertisement -

కరోనా వైరస్ మన దేశంలో పుట్టిన వ్యాధి కాదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కరోనా వైరస్ గురించి ప్రజలు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ మన దగ్గరకు రాదని చెప్పారు. ఇది మన దేశంలో పుట్టిన వ్యాధి కాదు. ఎక్కడో చైనా దేశంలో పుట్టి అది వ్యాపిస్తుంది. మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే తప్ప, ఇక్కడ ఉన్నవారిని ఎవరికీ వ్యాధి సోకలేదు. ఇతర దేశాల పర్యటనకు వెళ్లిన బెంగళూరు వ్యక్తికి వ్యాధి సోకడంతో అతనికి మన వైద్యలు చికిత్స చేశారు. అతను పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్‌ కూడా చేశారు.

ఇప్పటివరకు కరోనా మన దేశంలో 83మందికి మాత్రమే ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇందులో 66 మంది భారతీయులు, 17 మంది విదేశీయులు ఉన్నారు. వీరంతా విదేశీ పర్యటనకు వెళితే అక్కడ వైరస్‌ ప్రభావానికి గురయ్యారు. ఇందులో 10 మంది ఇప్పటికే కోలుకున్నారు. ఒక ఇద్దరు మాత్రమే వైరస్‌ ప్రభావంతో మృతి చెందారు. ఇప్పటికే పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకున్నారు. మన ప్రభుత్వం, ఆరోగ్య శాఖ కూడా వైరస్‌ను ఎదుర్కోవడానికి సర్వ సన్నద్దంగా ఉంది.

ప్రాథమికంగా దీని కోసం రూ.500 కోట్లు కేటాయిస్తు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిధి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధిలో ఉంటాయి. విమానాశ్రయంలో 200 మంది ఆరోగ్యశాఖకు చెందిన సిబ్బంది విదేశాల నుంచి వచ్చే వారిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పటికప్పుడు సిద్ధం కావడం సాధ్యం కాదు కాబట్టి అన్ని జిల్లాల్లో ఐసోలేటెడ్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. 321 ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌ బెడ్స్‌ కూడా సిద్ధంగా ఉంచాం. అన్ని కలిసి 1340 బెడ్స్‌ను రెడీగా పెట్టుకున్నాం. మార్చి 31వ తేదీ వరకు జనసామర్థ్యం ఎక్కువ ఉండకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మార్చ్ 31 వరకు బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్స్,, వర్క్ షాపులు మూసివేయాలి. మార్చి 31 తర్వాత అన్నీ మ్యారేజ్ హాల్స్ బుకింగ్స్ ను రద్దు చేయాలి లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం.

- Advertisement -