సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్

313
Kcr Chiranjeevi
- Advertisement -

కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైందేనన్నారు మెగాస్టార్ చిరంజీవి. సీఎం కేసీఆర్ ప్రజలందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీస్కుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ఏం చేసినా ప్రజల ఆరోగ్యాన్ని, అవసరాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటారని, కరోనా నియంత్రణకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

కరోనా నియంత్రణలో భాగంగా ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ను వాయిదా వేసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు. ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్ ని నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం కూడా పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -