సీఎం కేసీఆర్ శనివారం మంత్రులు, పార్టీ నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో యాసంగిలో ధాన్యం కొంటారా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలంటూ రెండు రోజులు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. మరో వైపు కేంద్రం శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించగా.. ఆయా అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది.
అలాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం నామినేషన్లకు గడువు ముగియనున్నది. ఎన్నికలు జరిగే తొమ్మిది జిల్లాల పరిధిలో ఓటు వేయనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు బలాబలాలతో పాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.