మహారాష్ట్ర యుగకవి అన్నాభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్. మహారాష్ట్రలోని వాటేగావ్‌లో నిర్వహించిన అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం…అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలని, ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
మహారాష్ట్ర గడ్డకు నా ప్రణామం. అణగారిన వర్గాల కోసం అన్నాభావు గొంతెత్తారు. సమస్యలను చూసి అన్నాభావ్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వంచిత, పీడిత ప్రజల తరఫున అన్నాభావ్ నిలిచారు. అన్నాభావు సాఠే గొప్పదనాన్ని రష్యా దేశం గుర్తించింది. కానీ మన దేశం గుర్తించలేకపోయిందన్నారు. మాతంగ్ సామాజిక వర్గానికి మహారాష్ట్ర రాజకీయాల్లో సముచిత స్థానం దక్కలేదు. మాతంగ్ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ తరపున సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Also Read:దిల్ సే..రిలీజ్ డేట్ ఫిక్స్
అన్నాభావ్ సాఠేను లోక్‌షాహెర్ బిరుదుతో సత్కరించారు. రష్యా ప్రభుత్వం అన్నాభావ్‌ను భారత మ్యాక్సిమ్ గోర్కి అని ప్రశంసించింది. అన్నాభావ్ రచనలు మరాఠీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నాభావు సాఠే రచనల పట్ల ఇప్పటికైనా మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఆయన చరలను ఇతర భాషల్లోకి అనువదించాలన్నారు.
Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో స్పెషల్ బ్రాంచ్ సీఐ రాజశేఖర్ రెడ్డి