ఆ బస్సుల రంగులను మార్చండి: సీఎం కేసీఆర్

217
cm kcr
- Advertisement -

మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ఆర్టీసీ ఉమెన్‌ బయో టాయిలెట్‌ బస్సులను టీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఈ బస్సులు గులాబీ రంగులో ఉండే విధంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్‌ ఆన్‌ వీల్స్‌’ను సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఈ బస్సుల రంగులపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.

ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రికి ఫోన్ చేసిన సీఎం….బస్సులు గులాబీ రంగులో ఉండకుండా చూడాలని తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో వెంటనే బస్సుల రంగులు మార్చాలని అధికారులకు సూచించారు మంత్రి పువ్వాడ అజయ్‌. ఖమ్మంలోని ఎస్సార్‌-బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఉమెన్‌ బయో టాయిలెట్స్‌ బస్సులను బుధవారం అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే.

- Advertisement -