- Advertisement -
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోగా కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పొటెత్తడంతో పరిస్థితిపై ఆరా తీశారు సీఎం కేసీఆర్.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్‌చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎం కేసీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వివరించారు. వరద కొంత తగ్గుముఖం పట్టిందని తెలిపారు.
వరద ఉధృతితో ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టులోకి భారీగా వస్తుండగా, ఔట్ ఫ్లో అదేస్థాయిలో లేకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -