ఎమ్మెల్యే రామలింగారెడ్డి భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

76
ramalinga reddy

అనారోగ్యంతో మృతిచెందిన దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు సీఎం కేసీఆర్. రామలింగారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం… వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే సోలిపేటతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని సీఎం కన్నీటి పర్యంతమైయ్యారు. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామన్నారు.

కడసారి తమ అభిమాన నేతను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. అంతిమయాత్రలో భాగంగా మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాడే మోశారు.

2001లో టీఆర్ఎస్‌లో చేరిన రామలింగారెడ్డి 2004, 2008,2014,2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు….కేసీఆర్ వెన్నంటే నడిచారు. దుబ్బాకను అభివృద్ధి పథంలో నిలిపేందుకు నిరంతరం కృషిచేశారు.