మాజీ మంత్రి రాంరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

201
kcr
- Advertisement -

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి కమతం రాంరెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. మూడు సార్లు పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కమతం…మంత్రిగా కూడా పనిచేశారు.కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

1968లో కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌విప్‌గా పనిచేశారు. 1977లో వెంగళరావు మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ, 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్‌లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఇవాళ సాయంత్రం మహబూబ్‌నగర్‌ మహమ్మదాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

- Advertisement -