జంగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం…

46
kcr
- Advertisement -

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.వరంగల్ జిల్లాకు చెందిన జంగారెడ్డి.. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

1935లో పరకాలలో జన్మించిన ఆయన ఉమ్మడి ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలు అందించారు. 1984లో ఎనిమిదో లోక్‌సభకు హనుమకొండ నియోజకవర్గం నుంచి పీవీ నరసింహారావుపై విజయం సాధించారు. ఆ సమయంలో బీజేపీ నుండి గెలిచిన ఇద్దరు ఎంపీల్లో ఆయన ఒకరు.

- Advertisement -