మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి భౌతికకాయానికి సీఎం నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్‌లోని జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నేత జైపాల్ రెడ్డి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అధికారిక అంత్యక్రియల కోసం తగిన ఏర్పాట్లు చేయలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషిని సీఎం ఆదేశించారు.రేపు మధ్యాహ్నం రాష్ట్రప్రభుత్వం అధికార లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్ తోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు కేకేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, పల్లారాజేశ్వర్ రెడ్డి, పలువురు నేతలు జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.