- Advertisement -
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేసిన సీఎం ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన వ్యక్తిగా దేశాభివృద్ధిలో పివి చెరగని ముద్ర వేశారని అన్నారు.
ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పీవీ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఢిల్లీస్థాయిలో తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టిన నేత, బహుభాషా కోవిదుడు పీవీ అని కొనియాడారు.
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పివి నరసింహా రావు 98వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, సతీష్ కుమార్, తాటికొండ రాజయ్య, జడ్పి చైర్మన్ సుధీర్ కుమార్, కార్పొషన్ చైర్మన్లు,కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, హరిత.
- Advertisement -

