ఆర్టీసీ మునగక తప్పదు…ఎవరు కాపాడలేరు: సీఎం కేసీఆర్

723
kcr rtc
- Advertisement -

ఆర్టీసీ కార్మికులది దురంహంకార,దుర్మార్గపురిత వైఖరని మండిపడ్డారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్…భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కేటాయించని విధంగా చెల్లింపులు ఇచ్చామన్నారు. 67 శాతం జీతాలను నాలుగేళ్లలో పెంచామన్నారు. ఆర్టీసీ మునగక తప్పదని ఎవరు కాపాడలేరన్నారు.

ఆర్టీసీని యూనియన్లు ముంచితే ప్రభుత్వం కాపాడాలా అన్నారు. ప్రపంచంలో ఆర్టీసీని ఎవరు కాపాడలేరని చెప్పారు. అద్దె బస్సులతో లాభాలు వస్తుంటే ప్రభుత్వ బస్సులతో నష్టాలు ఎలా వస్తాయో కార్మికులు చెప్పాలన్నారు. ఆర్టీసీ దగ్గర రూపాయిలేని పరిస్ధితి ఉందన్నారు. మూనియన్లు చేస్తుంది మహాపాపం,నేరం అన్నారు. ఆర్టీసీ బస్సులతో రోజుకు 3 కోట్ల నష్టం వస్తుందన్నారు.ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపై లేదా అని ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో కలపడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వ పరిధిలో 57 కార్పొరేషన్‌లు ఉన్నాయని అందరిని ప్రభుత్వంలో కలపడం కుదరడం అన్నారు. అర్ధరహిత,అసంబద్ద నినాదంతో కార్మికులు డిమాండ్ చేయడం సరికాదన్నారు.

దేశాన్ని తీవ్రమైన ఆర్ధిక మాంద్యం వేదిస్తోందని ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరికాదన్నారు. తాను రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీని లాభాల్లో నడిపించానని గుర్తుచేశారు. సీపీఎం పార్టీ 35 ఏళ్లు అధికారంలో ఉన్న బెంగాల్‌లో ఆర్టీసీని మూసివేసే పరిస్ధితి వచ్చిందన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని మూసివేసింది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు.

ఆర్టీసీ యూనియన్లు చేసే సమ్మెకు అర్ధం లేదని తిన్నది అరగక చేస్తున్నారని చెప్పారు. యూనియర్ ఎన్నికలు వస్తున్నాయంటే సమ్మెకు దిగడం అనవాయితీగా వస్తుందన్నారు. ఆర్టీసీ మూసి వేసే పరిస్ధితి వచ్చిందన్నారు. 5 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఆర్టీసీ ఉందన్నారు. పీఎఫ్ సొమ్మును ప్రభుత్వం వాడుకుందని అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సంవత్సరానికి రూ. 1200 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ ఉందన్నారు.

- Advertisement -