26న హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ సభ: సీఎం కేసీఆర్

595
cm kcr
- Advertisement -

హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం కేసీఆర్. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో తన సభ రద్దైన ప్రజలు ప్రభుత్వానికే అనుకూలంగా మద్దతిచ్చారని చెప్పారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్….ఈ ఎన్నికలు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు దోహదపడ్డాయని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోలేదన్నారు.43 వేల మెజార్టీతో సైదిరెడ్డిని గెలిపించారని చెప్పారు.

హుజుర్‌నగర్‌ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని వారి ఆశలు నెరవేరుస్తామని వెల్లడించారు. 26 సాయంత్రం హుజుర్‌నగర్‌లో సభను నిర్వహిస్తామని చెప్పారు. ఎదుటివారిని నిందించటమే ప్రతిపక్షాల వైఖరిగా మారిందన్నారు. ఇప్పటికైనా వారు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. రాజకీయాల కోసం పచ్చి అబద్దాలు చెప్పడం మంచిది కాదన్నారు. హుజుర్‌నగర్‌లో ప్రతిపక్షాల మాటలు బుమారాంగ్ అయ్యాయని చెప్పారు.

నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉంటే మంచిదన్నారు. బీజేపీకి డిపాజిట్‌ పోయిందన్నారు. వారికి వచ్చిన ఓట్లను చూస్తే నవ్వాలా ఏంచేయాలో అర్ధం కాలేదన్నారు. కేసీఆర్‌ని తిడితే పెద్దవారైతామని అనుకోవడం మంచిదికాదని సూచించారు. బీజేపీ నేతలు చీప్‌గా పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో సహనం అవసరం అని చెప్పిన సీఎం కేసీఆర్…గతంలో ఎన్నో విజయాలు సాధించాం కానీ ఎక్కడా గర్వపడలేదన్నారు.

తెలంగాణకు శాశ్వతంగా నీటి సమస్య ఉండదని,కరెంట్ సమస్యను అధిగమించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని చెప్పారు. సంక్షేమరంగంలో తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నించాయన్నారు. అధికారం ఉన్న లేకపోయినా అహంకారం,అసహనం ప్రతిపక్షాలకు మంచిదికాదన్నారు. ఎన్నికల్లో గెలుపుకోసం కృషిచేసిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో పాటు మంత్రులకు శుభాకాంక్షలు చెప్పారు.

- Advertisement -