ఏప్రిల్ 20 తర్వాత సడలింపు: సీఎం కేసీఆర్

247
cm kcr
- Advertisement -

రాష్ట్రంలో పీపీఏ కిట్లకు కొరతలేదన్నారు సీఎం కేసీఆర్. బుధవారం ప్రగతి భవన్‌లో కరోనాపై ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ..కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో లాక్ డౌన్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

ఏప్రిల్ 20 తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. లాక్ డౌన్ అమలు, పేదలకు సాయం అందించే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ముందుకుసాగాలన్నారు.

రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోందని…వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.ప్రభుత్వం వద్ద ఇప్పటికే 2.25 లక్షల పీపీఈ కిట్లు సిద్ధంగా ఉన్నాయని, మరో ఐదు లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్టు వివరించారు. బియ్యం పంపిణీ పూర్తయిందని, ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు చెప్పారు.

- Advertisement -