అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం మనదేనని..ఎవరు తొందరపడవద్దన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశంలో మాట్లాడిన సీఎం..కార్యకర్తలందరిని కలుపుకుని అభ్యర్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. కొంతమందికి పద్దతి మార్చుకోవాలని సూచించానని తెలిపారు. మళ్లీ విజయం మనదే అన్నారు. సాంకేతికంగా దెబ్బ తీసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పొందాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు.
నేతలతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని..ప్రచారంలో ప్రతి కార్యకర్తను కలవాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి లోపం లేకుండా ప్రతి అంశాన్ని తెలుసుకుని నామినేషన్ దాఖలు చేయాలన్నారు. ఎందుకంటే న్యాయస్థానాల్లో విచిత్ర తీర్పులు వస్తున్నాయని ఓడిపోయిన వారిని ఎమ్మెల్యేలుగా పరిగణిస్తూ తీర్పులు వస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉండవద్దన్నారు.న్యాయపరమైన అంశాల వల్ల వేములవాడ స్ధానాన్ని మార్చాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ కోపతాపాలు మంచివి కావన్నారు. కొన్ని స్ధానాల్లో తప్పక మార్చాల్సి వచ్చిందని చెప్పారు.
Also Read:‘గాంజా శంకర్’గా సాయి ధరమ్