ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష..

84
- Advertisement -

శనివారం ప్రగతిభవన్‌లో మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించనున్నారు. అలాగే ఐదు రోజులుగా పార్లమెంట్‌ ఉభయసభల్లో రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ ఎంపీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న పార్లమెంట్‌ సమావేశంలో కేంద్రం స్పందించిన తీరుపై.. సీఎం కేసీఆర్‌ మంత్రులు, ఎంపీలతో చర్చించనున్నారు.

సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో తదుపరి కార్యారణపై చర్చించడంతో పాటు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు లోక్‌సభలో మెజారిటీ విపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. టీఎంసీ, బీజేడీ, కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ సహా తొమ్మిది విపక్ష పార్టీలు లోక్‌సభ సాక్షిగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -