కరీంనగర్ నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నెల 17 కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ పరిధిలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపుగా రెండున్నర లక్షలకు పైగా ప్రజలను ఈ సభకు సమీకరించేందుకు టీఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బహిరంగసభస్థలిని పరిశీలించారు మంత్రి ఈటల రాజేందర్,ఎంపీ వినోద్ కుమార్,ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ని పరిశీలించారు.తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలని ,కరీంనగర్‌లోని స్పోర్ట్స్ స్కూల్ మైదానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడన వారు సీఎం కేసీఆర్ కరీంనగర్ నుండి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయవంతం అయిందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్ధానాలను గెలుస్తుందని తెలిపారు. ఈ సభకు భారీ ఎత్తున జనసమీకరణతో పాటు పార్కింగ్,సభకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.
ఈ నెల 19న నిజామాబాద్‌లో కూడా భారీ బహిరంగసభను ఏర్పాటుచేయనుంది టీఆర్ఎస్. ఉమ్మడి జిల్లాల ప్రకారం ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల్లో ఉంటే రెండు సభలు, భౌగోళికంగా పెద్దగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా రెండుమూడు సభలను నిర్వహించేలా టీఆర్ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. జహీరాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, ఖమ్మం లాంటి నియోజకవర్గాల్లో మూడు సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఓ వైపు కేటీఆర్ మరోవైపు సీఎం కేసీఆర్ ప్రచారంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ నింపనుంది.
టీఆర్ఎస్ లోకి కోమటిరెడ్డి బ్రదర్స్..!