కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు..

135
kcr cm
- Advertisement -

కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించి స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రెమిడెసివర్ వంటి మందుల విషయంలో గానీ, వాక్సీన్‌ల విషయంలో గానీ, ఆక్సీజన్ మరియు బెడ్ల లభ్యత విషయంలో గానీ, ఏ మాత్రం లోపం రానీయవద్దని, సీఎస్ ను సీఎం ఆదేశించారు.

అనుక్షణం కరోనా పర్యవేక్షణకు గాను సీఎంఓ నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగరూకతతో వ్యవహరిస్తూ,చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని సీఎం ఆదేశించారు.

- Advertisement -