కేరళ సీఎం పినరయి విజయన్ ,సిపిఐ జాతీయ ప్రదాన కార్యదర్శి రాజాలతో పాటు సిపిఎం, సిపిఐ నేతలతో సీఎం కేసీఆర్ ఎందుకు భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చించారా.. దేశంలో బీజేపీని నిలువరించేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్న అంశంపైనే ప్రధానంగా డిస్కస్ చేశారా..! ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చాంశనీయమైంది.
శనివారం సిపిఐ, సిపిఎం జాతీయ నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ , సిపిఎం,సిపిఐ పార్టిల జాతీయ నెతలు పాల్గొన్నారు.ఇరువురు ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాలపై నే చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో బిజెపి ఎలా నిలువరించాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ వేదికగా సిపిఎం సెంట్రల్ కమిటీ సమావేశాలు, సిపిఐ అనుబంధ సంస్థ యువజన విభాగం జాతీయ జరుగుతున్నాయి. ఆ రెండు పార్టీల అగ్ర నాయకత్వం అంతా ఈ సమావేశాలకు హాజరయ్యారు. ముఖ్యంగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తోంది అని…ఇది నిలువరించకుంటే దేశానికి ప్రమాదకరం అని ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు. బీజేపీని కంట్రోల్ చేయకుంటే ఇతర పార్టీలను, శక్తులను కలుపుకు వెళ్లాలని సిపిఎం,సిపిఐ పార్టిల అగ్ర నాయకత్వం డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో బీజేపీపై తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిన కేసీఆర్ వామపక్షాలతో సఖ్యత పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి మమత బెనర్జీ, స్టాలిన్ వంటి నేతలను కలిశారు. ఆ ప్రక్రియకు మధ్యలో బ్రేకులు పడ్డ.. మళ్లీ ఆ దిశగా కేసీఆర్ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. తెలంగాణ మీద బీజేపీ ఫోకస్ పెట్టడంతో కేసీఆర్ సైతం బీజేపీని దెబ్బ కొట్టే ఎత్తుగడలు వేస్తున్నారు. బీజేపీ మీద యుద్ధమే అని ప్రకటించారు. అందుకోసం మరోమారు కలిసొచ్చే పార్టీల నాయకులను కలుస్తానని ప్రకటించారు. అదే సమయంలో ఇప్పుడు వామపక్ష నేతలతో భేటీ కావడం ఫ్యూచర్ దొస్తికి సంకేతంగా చెబుతున్నారు.
రాష్ట్రంలో బిజెపి టిఆర్ఎస్ మధ్య రాజకీయంగా యుద్ధమే నడుస్తోంది. టిఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనే రీతిలో బిజెపి దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో బిజెపిని నిలువరించేందుకు కొత్త ఎత్తులు…పొత్తులతో కేసీఆర్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కమ్యూనిస్టు పార్టీలకు స్నేహ హస్తం అందించేందుకు గులాబీ బాస్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కమ్యూనిస్టులతో కలిసి పనిచేసారు కేసీఆర్.రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో బిజెపిపై పోరాటానికి కమ్యూనిస్టు పార్టీలు తోడైతే తమకు అదనపు బలవుతుందని కేసీఆర్ ఆలోచన. అందులో భాగంగానే లెప్ట్ పార్టిలకు చెందిన కీలక నేతలతో కేసీఆర్ చర్చించినట్లు టాక్.
దేశంలో బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం ఆలోచన చేస్తోందని వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. అంటే కాదు తెలంగాణలో సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేసే పనిలో ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపి ఇబ్బందులకు గురి చేస్తోంది. కేరళ ఎన్నికలకు ముందు కూడా పినరయి విజయన్ ను ఇలాంటి ఇబ్బందులకు గురిచేసినా కేరళలో వామపక్ష కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలోనూ బిజెపి దూకుడుగా వెళ్తూ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తోంది. దీంతో ఈ సమావేశం ఈ అంశాలన్నీ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.