పోడు సమస్య పరిష్కారం చేసే దమ్మున్న నాయకుడు కేసీఆర్..

60
- Advertisement -

సోమవారం ఖమ్మం పోడు భూముల సమస్యపై అఖిలపక్షం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ గారు రెండో సారి అధికారంలో వచ్చాక పోడు సమస్య పరిష్కారం కోసం పని చేస్తున్నారు, హామీ కూడా ఇచ్చారు. అసలైన లబ్దిదారులకు న్యాయం చేస్తామని సీఎం అన్నారు. పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాం. అడవులున్న చోటే పోడు సమస్య అధికం ఉన్నాయి. పరిష్కార మార్గాల కోసమే సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు అన్నారు మంత్రి.

2005 డిసెంబరు 13 తేదీ వరకు రికార్డ్ ఎవిడెన్స్ ఉన్న వారిని బేస్ చేసుకొని RORF చట్టం వచ్చింది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో 6 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు.. భద్రాద్రి జిల్లా లో 2 లక్షల 37 వేల ఎకరాలు ఆక్రమణ కాగా.. ఖమ్మం జిల్లాలో కాస్త తక్కువ ఉన్నది. పోడుకి పరిష్కారం చూపాలన్న ఆలోచన గత పార్టీలకు లేదు. కంటి తుడుపు కోసమే గత పాలకులు చట్టాలు చేశారు. వారికి చిత్తశుద్ది లేదు అని మంత్రి విమర్శించారు. పోడు సమస్య పై ముఖ్యమంత్రి కేసీఆర్ మస్తిష్కంలో మదనం చేస్తున్నారు. ఒంటి చేత్తో తెలంగాణ రాష్ట్ర సాధన చేసిన లెజండ్రీ నాయకుడు కేసీఆర్ మాత్రమే.. పరిష్కారం చూపగలరు అని తెలిపారు.

కటాఫ్ డేట్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించ లేదు..కేంద్రం దగ్గర అనేక తీర్మానాలు పెండింగులో ఉన్నాయి. అటవీ భూముల హక్కులన్నీ కేంద్రం పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే పరిష్కారం చేయాలని సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారు. పోడులో ఉండి నిజంగా వ్యవసాయం చేస్తూ, 10 ఎకరాల్లోపు ఉంటే పరిష్కారం చేయాలని మా చిత్తశుద్ధి. సమస్య పరిష్కారం విషయంలో సీఎం కేసీఆర్ హృదయం సముద్రమంత విశాలమైనది. ఈ ప్రపంచgలో కేసీఆర్ గారిని మించిన దయార్థ హృదయులు లేరని నా భావన అన్నారు. RORF చట్టం ప్రకారమే పోడు భూములను రెగ్యూలరైజ్ చెయ్యాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయ లబ్దిపోందాలనే ఆలోచన టీఆర్ఎస్ పార్టీకి గానీ, ప్రభుత్వానికి లేదన్నారు.

అటవీ పరిరక్షణ మనందరి బాధ్యత.. గిరిజనేతరులు కూడా వందల ఎకరాలు పోడు భూమి కొడుతున్నారు.యంత్రాల సాయంతో అడవిని నాశనం చేస్తున్నారు.అడవులు పలుచనైతే రాజకీయ పార్టీలు కూడా పలుచన అవుతాయి. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలి. అటవీ ఆక్రమణ ఆగిపోవాలి. పోడు సమస్య పరిష్కారం చేసే దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు మంత్రి పువ్వాడ. ప్రభుత్వం మీద భరోసా ఉంచి అందరూ సహకరించండి. త్వరలో పరిష్కారం రాబోతుంది. అధికారులు సంయమనం పాటించాలి. గిరిజనులను వేదించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. గిరిజనులు, పోలీసు, పారెస్ట్ అధికారులు సహకరించుకోవాలి.. సంయమనం గా ఉండాలని మంత్రి కోరారు. గ్రామ సభలోనే లబ్దిదారుల ఎంపిక జరుగుద్ది.. భూమి రికార్డుల కోసం వేధింపులు ఉండవు. బినామీలను కంట్రోల్ చేయాలి.. ఒకరికే 60/ 70 ఎకరాల పోడు భూమి ఎలా ఉంటుంది ..? కబ్జాదారులు, భూ అక్రమనదారుల భరతం పట్టాలి.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.

- Advertisement -