ఉజ్జయిని మహంకాళి జాతరకు సీఏం కేసీఆర్‌కు ఆహ్వానం

81
kcr bonalu
- Advertisement -

తెలంగాణలో జరిగే బోనాల పండుగను ప్రజలందరూ ఘనంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17,18వ తేదీలలో నిర్వహించే శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగను సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. తలసాని ఆద్వర్యంలో ఆలయ అధికారులు ,పాలక మండలి సభ్యులు బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ట్రస్టీ కామేష్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు.

- Advertisement -