మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు మరో వెయ్యి పింఛను పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా వచ్చే నెల నుంచి దివ్యాంగులకు రూ.4116పెన్షన్లు ఇవ్వనున్నట్టు కేసీఆర్ తెలిపారు. సంక్షేమంలో బాగున్నాం. అలాగే వ్యవసాయంలో బాగున్నాం కాబట్టే మనం దివ్యాంగులను ముసలమ్మలు ముసలి తాతలను ఆసరా పెన్షన్‌తో ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం.
134యేళ్ల చరిత్ర కలిగిన సింగరేణి. ఇది మన సొత్తు. వేలాది మందికి అన్నం పెట్టిన ఈ సింగరేణిని మనమే కాపాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో సింగరేణి సర్వనాశనం అయ్యింది. కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చింది. చివరికి అప్పులు కట్టలేక కేంద్రానికి 49శాతం వాటా కింద అమ్మేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుతుంది. ఆవిధంగా సింగరేణిని పూర్తిగా నాశనం చేశారు. వచ్చే దసరాకు కార్మికులకు రూ.700కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.
Also Read: బీసీల్లోని వృత్తికులాలకు ఆర్థికసాయం..
కాంగ్రెస్ హయాంలో సింగరేణికి రూ.300 నుంచి రూ.400కోట్లు వచ్చేవి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గడిచిన రూ.2184కోట్లు వస్తున్నాయి. సింగరేణిలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే గత ప్రభుత్వాలు రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకునేవారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10లక్షలు ఇస్తున్నామని అన్నారు. వడ్డీ లేకుండా ఇంటి కోసం రుణంగా రూ.10లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు.
Also Read: CMKCR:దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ