వ‌న‌ప‌ర్తిలో టీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

63
- Advertisement -

సీఎం కేసీఆర్‌ ఈరోజు వ‌న‌ప‌ర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈపర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈమేరకు కేంద్రంలో నూత‌నంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఈ సంద‌ర్భంగా కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించారు. కార్యాల‌యం ప్రారంభోత్స‌వం అనంత‌రం జిల్లా పార్టీ అధ్య‌క్షుడు గ‌ట్టు యాద‌వ్‌ను కేసీఆర్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములుతో పాటు ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

- Advertisement -