యాదాద్రి ప్రెసిడెన్షియల్ విల్లాను ప్రారంభించిన సీఎం కేసీఆర్..

37
cm kcr
- Advertisement -

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు ఈరోజు యాదాద్రి పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యాదాద్రి దేవాలయానికి సమీపంలో నిర్మించిన వీవీఐపీల విడిది ప్రెసిడెన్షియల్ విల్లాను మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం సీఎం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రెసిడెన్షియల్ విల్లాను పరిశీలించారు. తర్వాత యాదాద్రి యాగశాలను ఆయన పరిశీలించనున్నారు. తదనంతరం భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా ఆఫీసును ప్రారంభించి.. కలెక్టరేట్ పక్కన జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

కాగా, ప్రెసిడెన్షియల్ సూట్ ను 1,500 చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. లక్ష్మీనృసింహుడి ఆలయ వీక్షణ కోసం అందులో ప్రత్యేకంగా ఒక వ్యూ పాయింట్ ను ఏర్పాటు చేశారు. యాదాద్రి చిన్నకొండపై 14 విల్లాలు, ఒక మెయిన్ సూట్ ను 13.25 ఎకరాల్లో నిర్మించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ లు ఎలిమినేటి కృష్ణారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎం సి కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, ఎన్ . భాస్కర్ రావు, నోముల భగత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ మహేష్ భగవత్, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, గోట్ అండ్ షీప్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, సీఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఎన్సీ గణపతి రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వై టి డి ఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈఓ గీతారెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మదర్ డైరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -