- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికను ప్రారంభించారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక భవనాన్ని మంత్రులతో కలిసి ప్రారంభించారు సీఎం కేసీఆర్. అనంతరం రైతులతో సమావేశం అయ్యారు సీఎం. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వేద పండితులు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 350 కోట్ల వ్యయంతో 2,601 రైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఇందులో 2,462 గ్రామీణ ప్రాంతాల్లో, 139 పట్టణాల్లో ఉన్నాయి. ఒక్కో రైతు వేదికను 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 1,951 రైతు వేదికల నిర్మాణం పూర్తికాగా, 650 నిర్మాణ దశలో ఉన్నాయి. పక్షం రోజుల్లో వీటన్నింటినీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ఆదేశించారు. ఇందులో భూవిరాళంతో నిర్మిస్తున్న రైతు వేదికలు 139 ఉన్నాయి.
- Advertisement -