అమరుల యాదిలో అమరజ్యోతి..

84
- Advertisement -

స్వరాష్ట్ర సాధనకు ఊపిరి పోసిన త్యాగం వారిది. తాము చనిపోయిన పర్వాలేదు ప్రత్యేక తెలంగాణ రావల్సిందేనని ప్రాణత్యాగానికి వెనుకాడలేదు. ఎంతోమంది పోరాటానికి తోడు అమరుల త్యాగాలతో స్వరాష్ట్ర కల సాకారమైంది. రాష్ట్రం ఆవిర్భవించిన తొలిరోజు నుండే అమరుల సంక్షేమానికి పాటు పడుతోంది కేసీఆర్ సర్కార్‌.

తాజాగా అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాం అమరజ్యోతిని ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం 6:30 గంటలకు అమరదీపం ప్రాంగణానికి చేరుకొంటారు. అనంతరం 12 తుపాకులతో అమరవీరులకు గన్‌ సెల్యూట్‌ ఉంటుంది. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభిస్తారు.

Also Read:ఆర్య.. పాన్ ఇండియా మూవీగా మిస్టర్‌X

ఆ వెంటనే సభావేదికపైకి చేరుకొంటారు. అమరులకు నివాళిగా గేయాలను ఆలపిస్తారు. సభలో 10వేల మంది క్యాండిల్‌ లైట్స్‌ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. ఎంపికచేసిన ఆరుగురు అమరుల కుటుంబాలను సన్మానిస్తారు. అలాగే, లేజర్‌, 800 డ్రోన్లతో షో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ముగియనున్నాయి.

Also Read:సామజవరగమన.. హోలా రే హోలా పాట విడుదల

- Advertisement -