రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ఆదరణః సీఎం కేసీఆర్

463
cmkcr Lb Stadim
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ఆదరణ లభిస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్‌ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ క్రిస్మస్‌ ట్రీ వెలిగించారు.

ఈసందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. క్రిష్టియన్లు అందరికి క్రిస్మన్ అలాగే నూతన సంవత్సర శుభాకంక్షాలు తెలియజేశారు. తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ది చేసుకుంటున్నాం. తెలంగాణ రాకముందు మన ముందు చాలా కష్టాలు ఉండే..ఇప్పుడు కష్టాలనుంచి బయటపడ్డం. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా అందరికి అన్ని రకాల పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. 20-25ఏళ్లలో నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే పూర్తి చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టుతో 70 నుంచి 75 లక్షల ఎకరాలు సాగవుతాయన్నారు.

- Advertisement -