సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ

401
Cabinet Meeting
- Advertisement -

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ అనంతరం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరుగుతుంది. కాసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో 2019-20 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించనున్నారు

విస్తరణ అనంతరం పూర్తిస్థాయి మంత్రివర్గం సమావేశంకావడం ఇదే తొలిసారి. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో సోమవారం ప్రవేశపెట్టే బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది.

- Advertisement -