తమిళనాడు సీఎంకు కేసీఆర్‌ కృతజ్ఞతలు..

101
kcr

వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి రూ. 10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సాయంతో పాటు, బ్లాంకెట్లు, చద్దర్లు, ఇతర సామాగ్రి కూడా పంపుతామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదారంగా ముందుకు వచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి, తమిళనాడు ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా, మున్ముందు ఏదైనా సాయం కావాల్సి వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడు ప్రభుత్వం, అక్కడి ప్రజలు సంఘీభావం ప్రకటించిన తీరు పట్ల ధన్యవాదాలు తెలిపినట్టు సీఎంఓ పేర్కొంది.