సీఎం కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం..

274
CM KCR has narrow escape after minor fire on his helicopter
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు పెను ప్రమాదం తగ్గింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ఆకస్మాత్తుగా పోగలు వెలువడ్డాయి. వైర్ లెస్ బాక్స్‌ నుంచి పోగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే స్పందించి బ్యాగును బయటపడేశారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక అందరు భయపడ్డారు.ఈ ఘటన జరిగిన తర్వాత కేసీఆర్ తిరిగి అదే హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరారు.

సీఎం కేసీఆర్ క్షేమంగా ఉన్నారని..ఆల్ ఈజ్ వెల్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. కేసీఆర్ ఆదిలాబాద్ పర్యటన కొనసాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో ప్రమాదం జరగడం ఇది రెండోసారి. గతంలో సాంకేతిక కారణాలతో హెలికాప్టర్‌ ల్యాండ్‌ కాకపోవడంతో టెన్షన్‌ నెలకొనగా తాజాగా పొగలు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.

కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి పెద్దపల్లి వెళ్లిన సీఎం. అంతర్గాం మండలం ముర్ముర్ దగ్గర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించి అక్కడ బహిరంగసభలో మాట్లాడారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లాకు బయలు దేరే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న సీఎం..చనాక-కొరాట బ్యారేజీ పనులను పరిశీలించారు.

- Advertisement -