- Advertisement -
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వైద్యశాఖను అప్రమత్తం చేసిన ప్రభుత్వం…వయసుతో సంబంధంలేకుండా అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయం తీసుకోగా తాజాగా వైద్యశాఖలో 755 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్.
కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా 114 దవాఖానాలల్లో సరిపోను సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. 144 మంది డాక్టర్లు, 527 మంది నర్సు లు, 84 మంది లాబ్ టెక్నీషియన్లు, మొత్తం 755 పోస్టులను సీఎం మంజూరు చేశారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఇంటర్వూలను నిర్వహించి, అర్హులైన సిబ్బంది నియామకాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -