ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97డిపోలకు సంబంధించిన కార్మికులతో ప్రగతి భవన్ లో సీఎం సమావేశం అయ్యారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. కార్మికులతో కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కార్మికులతో నేరుగా మాట్లాడారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఆర్టీసీలో ఒక్క ఉద్యోగిని కూడా తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసానిచ్చారు. ఒక్క రూటులో ఒక్క ప్రైవేట్ బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమన్నారు.
ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచుతామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని కార్మికులకు సూచించారు. ప్రతీ ఉద్యోగి ఏడాదికి రూ.లక్ష బోనస్ అందుకునే స్థితికి రావాలి. ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ జీతాన్ని రేపు అందిస్తం. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.