స్టార్ దర్శకుడి సినిమాలో రాహుల్ సిప్లిగంజ్

589
rahul sipligunz
- Advertisement -

బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాహుల్ కు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు సింగర్ గానే రాహుల్ కు అవకాశాలు వచ్చాయి. కానీ తాజాగా ఓ స్టార్ దర్శకుడు నటుడిగా రాహుల్ కు అవకాశం ఇచ్చారు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిన రంగమార్తాండ మూవీలో ఛాన్స్ కొట్టేశాడు రాహుల్ సిప్లిగంజ్.

ఈవిషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ , కమెడియన్ బ్రహ్మనందం, సీనియర్ నటీ రమ్మకృష్ణ లు నటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ అద్భతమైన నటులతో కలిసి నటించే అవకాశం, అదీ మొదటి సినిమాలో ఇలా కుదరడం తన అదృష్టంగా భావిస్తున్నాని తెలిపాడు.

తనకు మొదటిసారిగా నటించేందుకు అవకాశం ఇచ్చిన దర్శకుడు కృష్ణ వంశీకి ధన్యవాదాలు తెలిపాడు రాహుల్. కాగా ఇటివలే రాహల్ సిప్లిగంజ్ తన అభిమానుల కోసం లైవ్ మ్యూజికల్ కన్సార్ట్‌ను నిర్వహించాడు. ఈకార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి రాహుల్ అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేశారు.

https://www.instagram.com/sipligunjrahul/?utm_source=ig_embed

- Advertisement -