రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…

147
cm kcr
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చామని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం….హైదరాబాద్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.భారతదేశంలోనే ఐటీలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందన్నారు సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే గొప్ప కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ అన్నారు.హైదరాబాద్ నగరానికి విశ్వఖ్యాతి తీసుకొచ్చేలా టీఆర్ఎస్ కృషిచేస్తోందన్నారు.

హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే చేయి చేయి కలిపి ముందుకొచ్చి టీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు.రాబోయే కొద్దిరోజుల్లో జీహెచ్‌ఎంసీ కొత్త చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు.టీఎస్ బీపాస్‌ను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. టీఆర్ఎస్ తీసుకొస్తున్న పథకాలతో యావత్ దేశం ఆశ్చర్యపోతోందన్నారు.

భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించని ప్రగతి,అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందన్నారు.రాష్ట్రమంతా 24 గంటల మంచినీటి సరఫరా తీసుకురావాలన్నది తన కల అన్నారు. హైదరాబాద్‌కు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.ఈ డిసెంబర్ నెల నుండి హైదరాబాద్ ప్రజలకు ఫ్రీ వాటర్ సప్లై అమలు చేస్తామని తెలిపారు. ఢిల్లీ తర్వాత ఫ్రీ వాటర్ స్కీం అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందన్నారు. ఇది గ్రేటర్ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న తీపి కబురు అన్నారు. మంచినీటి రంగంలో వచ్చే సంస్కరణలను ప్రజలు దుర్వినియోగం చేయవద్దన్నారు. త్వరలో రాష్ట్రమంతా ప్రజలకు ఉచితంగా మంచినీటిని అందిస్తామన్నారు.20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందిస్తామన్నారు.

జంటనగరాల్లో ఉండే సెలూన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నాయిబ్రాహ్మణులకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తామని నాయిబ్రాహ్మణులకు తీపి కబురు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉండే దోబి ఘాట్‌లకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తామని ప్రకటించారు. సఫాయిలకు రానున్న రోజుల్లో మరింత జీతం పెంచుతామన్నారు.

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను కరోనా తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పారు సీఎం కేసీఆర్. అన్నిరకాల షాపులకు రాష్ట్రవ్యాప్తంగా కనీస విద్యుత్ ఛార్జీ డిమాండ్‌ను రద్దు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వమే సబ్సిడీ ఎలక్ట్రిసిటీ బోర్డులకు చెల్లిస్తుందన్నారు. మార్చి నుండి సెప్టెంబర్ వరకు కరెంట్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ట్రాన్స్‌పోర్టు వాహనాలకు మార్చి నుండి సెప్టెంబర్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

సినీ పరిశ్రమలో 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు వీరిలో 16 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు వీరంతా బ్రతుకుదెరువు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. 40వేల మందికి కార్మికులకు హెల్త్,రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. సినిమా థియేటర్లు ప్రారంభమయ్యేవరకు ప్రభుత్వమే కనీస విద్యుత్ ఛార్జీని చెల్లిస్తుందన్నారు. సినిమా థియేటర్లు ఈరోజు నుండే తెరుచుకోవచ్చని తెలిపిన సీఎం…కరోనా మరింత ప్రభలకుండా చూడాలన్నారు.

10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించే చిన్న సినిమాలకు జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఏ థియేటర్‌ అయినా మల్టిపుల్ షోలు వేసుకునేందుకు అనుమిస్తున్నామని చెప్పారు. సినిమా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. వరద బాధ నుండి హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.మెట్రో సెకండ్ ఫేజ్‌ను త్వరలో పూర్తి చేస్తామన్నారు.పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలన్నారు. వరద బాధితులకు రూ. 10 వేల సాయాన్ని అందించామని చెప్పారు. ఎన్నికల తర్వాత వరద సాయాన్ని అందిస్తామని చెప్పారు సీఎం. టీఎస్ బీపాస్ కావాలా…నిత్యం కర్ఫ్యూలతో ఉండే హైదరాబాద్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. హైదరాబాద్ నగరం సెక్యూలర్ నగరం అన్నారు.

- Advertisement -