- Advertisement -
అంగన్‌వాడీలకు శుభవార్తను అందించారు సీఎం కేసీఆర్. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీ ఉద్యోగులను చేర్చాలని నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలోని 70వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారని చెప్పారు.ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్‌వాడీల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్లపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
Also Read:‘ఉస్తాద్ భగత్ సింగ్’..షెడ్యూల్ పూర్తి
- Advertisement -