సింగరేణి ఉద్యోగులకు శుభవార్త..

46
- Advertisement -

సింగరేణి ఉద్యోగులకు శుభవార్తను అందించింది తెలంగాణ ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీ పేరును సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SIMS) గా మార్చడంతో పాటు, ఉద్యోగుల పిల్లలకు ఎంబిబిఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సింగరేణి ఉద్యోగుల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రామగుండం మెడికల్ కాలేజిలో మొత్తం150 ఎంబిబిఎస్ సీట్ల ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటా కి వెళ్తాయి. మిగతా 127 ఎంబిబిఎస్ సీట్లలో 5% రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయించడం జరిగింది.

Also Read:బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు..

నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. వీటితో పాటుగా ఈ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని 50 పడకలను సింగరేణి ఉద్యోగులకు కేటాయించింది సర్కార్.

Also Read:దోసకాయతో ఉపయోగాలు..

- Advertisement -